Breaking News

బీఆర్‌ఎస్‌పై భారీ ఎఫెక్ట్‌!

Published on Sat, 02/28/2026 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేయడంతో..ఆ కేసు రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశమయ్యింది. కేసు పూర్వాపరాలను, కవితపై ఆరోపణలు, అరెస్టు తదితర పరిణామాల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు కూడా చర్చనీ యాంశమవుతున్నాయి.

ముఖ్యంగా ఈ కేసు కారణంగా బీఆర్‌ ఎస్‌ భారీ కుదుపులకు లోనైందని, రాజకీయంగా నష్టపోయిందంటూ ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఎన్నికల్లో దెబ్బతీసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును తెరపైకి తెచ్చిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి.  

అనేక కీలక పరిణామాలు..
లిక్కర్‌ కేసులో కవితను ఈడీ, సీబీఐ విచారించడంతో మొద లైన వివాదం పార్టీలో ఇంటా బయటా అనేక పరిణామాలు, రాజకీయ మలుపులకు దారి తీసింది. మద్యం పాలసీ కేసులో ముడుపులు ఆరోప ణలతో కవితను 2024 మార్చిలో అరెస్టు చేసి తీహార్‌ జైలుకు తరలించారు. ఇది బీఆర్‌ఎస్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అదే ఏడాది ఏప్రిల్, మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవక పోవడానికి కవితపై వచ్చిన ముడుపుల ఆరోపణలు, ఆమె అరెస్టే కారణమంటూ పార్టీ లోపలా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. 

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగానే..
రాష్ట్ర్టంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ మద్యం పాలసీ అంశం తెరమీదకు వచ్చింది. 2021లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం 2021–22 కొత్త ఎక్సైజ్‌ పాలసీని అమల్లోకి తెచ్చింది. రిటైల్‌ మద్యం విక్రయాలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా ఈ విధానం ప్రవేశ పెట్టారు. అయితే లైసెన్సుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దీనిపై సీబీఐ విచారణకు సిఫారసు చేయగా, ఈడీ కూడా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించింది. 

ఆప్‌ నేతలకు ముడుపులు ఇచ్చారనే కోణంలో..
‘సౌత్‌ గ్రూప్‌’ పేరిట దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు నేత లు ఆప్‌ నేతలకు ముడుపులు ఇచ్చి లైసెన్సులు పొందారనే కోణంలో విచారణ జరిగింది. ఇందులో నాటి తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూతురు, అప్పటి ఎమ్మెల్సీ కవిత కూడా ముడుపులు ఇచ్చినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హైదరా బాద్, ఢిల్లీలో ఈడీ, సీబీఐ వేర్వేరుగా కవితను పలుమార్లు విచారించాయి. తనపై రాజ కీయ ప్రేరేపిత కేసు నమోదైందని కవిత వాదించారు. 2024 మార్చిలో కవిత అరెస్టు అయ్యారు. 2024 చివరలో ఈడీ, సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేశాయి. సుమారు ఐదు నెలల పాటు జైలు జీవితం తర్వాత కవిత బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)