Breaking News

హస్తినలో హై టెన్షన్‌.. ఢిల్లీ పరిణామాలపై సీఎం కేసీఆర్‌ ఆరా..

Published on Sat, 03/11/2023 - 14:46

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ పరిణామాలను సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. ఎప్పుటికప్పుడు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌ కీలక నేతలు క్యూ కడుతున్నారు.

కాగా, లిక్కర్‌ స్కాంలో కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. లిక్కర్‌ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు. ఇండో స్పిరిట్స్‌ కంపెనీలో వాటాలు, రూ. 100కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ కూపీ లాగుతుంది. ఇప్పటి వరకు లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు వద్ద దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈడీ, బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుటుంబమే లక్ష్యంగా కేంద్రం దాడులు చేస్తోంది. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదు. ఈడీ విచారణలో ఏ తప్పు చేయలేదని తేలుతుంది. మోదీకి జై కొడితే ఎలాంటి నోటీసులు ఉండవు. వ్యతిరేకిస్తే నోటీసులు ఇస్తారంటూ ఆయన మండిపడ్డారు. 
చదవండి: కవితపై బండి అనుచిత వ్యాఖ్యలు!

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)