Breaking News

నెమ్మదించిన కీలక కేసుల దర్యాప్తు

Published on Wed, 09/11/2024 - 03:19

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కాలంలో ఎంతో సంచలనంగా మారి.. నిత్యం వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఒక్కో కేసులో ఒక్కో అంశం కారణంగా దర్యాప్తు నెమ్మదించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వరుస అరెస్టులతో మొదట్లో హడావుడిగా నడిచింది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇష్టానుసారంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో అప్పటి ఎస్‌ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిïÙట్‌ సైతం దాఖలుచేశారు. ఇక్కడి వరకు దర్యాప్తు ఫుల్‌స్పీడ్‌లో కొనసాగింది.

అయితే, కీలక నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్‌ అమెరికాలో ఉండటంతో వారిని అరెస్టు చేసి, తమ కస్టడీలోకి తీసుకుంటే తప్ప దర్యాప్తులో ముందుకుసాగని పరిస్థితి. ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
 
గొర్రెల కేసులో... 
ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత విచారణకు ఆదేశించిన మరో కీలక కేసు గొర్రెల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలకు సంబంధించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. 

అయితే, ఈ కేసు దర్యాప్తు అధికారి మారడంతో మళ్లీ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక అరెస్టులు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో ఈ కేసు ముడిపడి ఉండడం.. ఏసీబీలో సరిపడా సిబ్బంది లేకపోవడం సైతం క్షేత్రస్థాయిలో దర్యాప్తు జాప్యానికి కారణం అవుతోంది.
  
రూ.1,000 కోట్ల జీఎస్టీ కేసులో.. 
అత్యంత సంచలనంగా మారిన మూడో కేసు.. వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల జీఎస్టీ కుంభకోణం. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నిందితుడిగా చేర్చడంతో ఈ కేసుపైనా తీవ్ర చర్చ జరిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. 

అయితే, తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చి నా.. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు సరిగా లేవని అంటున్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం సాధ్యం కాకపోవడంతో సీఐడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో అవసరమైన సమాచారం కోసం ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖకు లేఖలు రాశారు. ఆ సమాచారం వస్తే తప్ప దర్యాప్తులో ముందడుగు పడని పరిస్థితి.  

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)