Breaking News

జూన్‌లో లోటు వర్షపాతమే!

Published on Thu, 06/20/2024 - 04:41

సాక్షి, హైదరాబాద్‌:  నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. జూన్‌ నెల మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఆ తర్వాత అత్యంత చురుకుగా కదిలి ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం రుతుపవనాల కదలికలు మందగమనంలోనే ఉన్నాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 

మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్‌ నెలకు సంబంధించిన అంచనాలను ఐఎండీ తాజాగా విడుదల చేసింది. ఈ నెలలో రాష్ట్రంలోని చాలాచోట్ల లోటు వర్షపాతం నమోదయ్యే పరిస్థితులే కనిపిస్తున్నట్లు తెలిపింది. 

నెలాఖరులో వర్షాలు కురుస్తాయని, సాధారణ వర్షపాతానికి దగ్గరగా గణాంకాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ మొత్తం మీదా చాలాచోట్ల లోటు ఉంటుందని ప్రకటించింది. 

8 జిల్లాల్లో సాధారణం..11 జిల్లాల్లో లోటు 
జూన్‌ నెలలో ఇప్పటివరకు 7.85 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. బుధవారం ఉదయానికి 8.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 9 శాతం అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

ఈనెల చివరి వారంలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, తూర్పు ప్రాంత జిల్లాల్లోనే ఇందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక 11 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. మంచిర్యాలలో లోటు ఎక్కువగా నమోదైంది.  

రానున్న రెండ్రోజుల్లో వర్షసూచన 
ప్రస్తుతం కోస్తాంధ్రను ఆనుకుని తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందని, దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

జూన్‌లో ఇప్పటివరకు జిల్లాల వారీగా వర్షపాతం.. 
»   తీవ్ర లోటు (–60% నుంచి –99%):            మంచిర్యాల 
»    లోటు(–20% నుంచి –59%): ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి  
»    సాధారణం(+19% నుంచి –19%): వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, ఖమ్మం 
»    అధికం(+20% నుంచి +59%): మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నారాయణపేట  
»     అత్యధికం(+60% పైబడి): హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ 

జూన్‌లో సాధారణ వర్షపాతం : 12.94 సెంటీమీటర్లు 
బుధవారం నాటికి కురవాల్సిన వర్షం : 7.85 సెంటీమీటర్లు 
నమోదైన వర్షపాతం : 8.53 సెంటీమీటర్లు సాధారణం కంటే 9 శాతం అధికంగా నమోదు  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)