Breaking News

యాదగిరిగుట్ట క్షేత్రానికి భద్రత ఏది?

Published on Tue, 06/03/2025 - 07:21

సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీస్వామివారికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇటీవల జరిగిన చింతపండు దొంగతనం వెలుగుచూడటంతో ఆలయ భద్రతలో ఉన్న డొల్లతనం భయట పడింది. కొండపైన కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో అలంకార ప్రాయంగా మిగిలింది. యాదగిరి క్షేత్రం అభి వృద్ధి తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర పతి, ప్రధాని వంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న ప్రముఖులతోపాటు ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, ఇటీవల విశ్వం నలుమూ లల నుంచి అందగత్తెలు వచ్చారు. 

ఇలా ఒకరే మిటి వివిధ స్థాయిల్లోని సెలబ్రిటీలు వస్తు న్నారు. వీరి భద్రత కోసం ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను తీసుకు వచ్చే కంటే స్థానికంగా ఆర్మ్‌డ్‌ఫోర్స్‌ను సిద్ధగా ఉంచాలని గతంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా గుర్తించిన గుట్ట క్షేత్రం భద్రతకు ప్రత్యేక భద్రతా ప్రణాళికను రూపొందించారు. దేశ విదేశాల నుంచి వీవీఐ పీలు, వీఐపీలు వచ్చిన ప్రతిసారీ భద్రత కో సం రాచకొండ కమిషనరేట్‌ నుంచి నలు మూలల నుంచి సిబ్బందిని రప్పిస్తున్నారు.  

సిబ్బంది లేరు..
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం బాధ్యతలను చూడటానికి ఏసీపీ స్థాయిలో అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్‌ డివిజన్‌ ఏర్పాటు చేశారు. ఏసీపీని నియమించినా.. పూర్తిస్థాయి సిబ్బంది లేరు. కొండపైన అప్‌హిల్‌ పోలీస్‌ స్టేషన్, సీసీఎస్, మహిళా పోలీస్, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్, ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్ట పీఎస్‌తోపాటు మరో పీఎస్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటికి స్టేషన్‌ హౌస్‌ అధికారులుగా ఇన్‌స్పెక్టర్‌లు ఉంటారు. దీంతోపాటు మొత్తంగా ఎస్సైలు ,ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తంగా 300 మంది వరకు అదనంగా సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

సాయుధ దళం ఏర్పాటు చేయాలని..
బ్రహ్మోత్సవాల సమయంలో వీవీఐపీలు గుట్టకు వచ్చినప్పుడు రక్షణ బాధ్యతలను చూడటానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రిజర్వ్‌పోలీస్, ఆక్టోపస్‌ గ్రేహౌండ్స్‌ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. 25 మందితో ఆక్టోపస్‌ పోలీస్‌ దళం ఉంటుందని అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. 

30 ఎకరాల స్థలం కేటాయింపు 
దేవాలయ అభివృద్ధికి కేటాయించిన భూమిలోనే 30 ఎకరాల స్థలం యాదాద్రి ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కోసం కేటాయించారు. ఆ స్థలాన్ని చదును చేసి వదిలేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఎలాంటి నిర్మా ణాలూ చేపట్టడం లేదు. ఇందులోనే ప్రధాన కార్యాలయాలు, పరేడ్‌ గ్రౌండ్, శిక్షణా కేంద్రం క్వార్టర్‌లు నిర్మించాలి.  

భద్రతకు ఏదీ ప్రాధాన్యం?  
ఆలయంతో పాటు భక్తుల భద్ర తకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సీసీ కెమెరాల నిఘాలో శాంతిభద్రతల పర్యవేక్షణ ఉండాలి. వైటీడీఏ (యాదా ద్రి ఆలయ అభివృద్ధి బోర్డు) స్వయంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. వీఐపీల తాకిడి ఎక్కువ గా ఉంటుంది. భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు నిత్యం అందుబాటులో ఉండాలి. దాని కోసం రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌ను యాదగిరి గుట్టలోనే ఏర్పాటు చేయాలి. ఏసీపీ కార్యాలయం, టెంపుల్‌ సిటీకి ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్‌ మంజూరు చేసి వదిలేశారు.  

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)