మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు
Published on Wed, 04/07/2021 - 13:08
సాక్షి, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన మాసున శ్రీనివాస్ (38) పాము కాటుకు గురై మృతి చెందగా, కూతురే కొడుకై తండ్రి చితికి నిప్పు పెట్టింది. శ్రీనివాస్ జీవనోపాధి కోసం హన్మకొండలో ఓ మడిగను అద్దెకు తీసుకొని కంకబొంగులతో గంపలు, తడకలు అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అద్దెకు ఉంటున్న మడిగలో సోమవారం రాత్రి శ్రీనివాస్ పాము కాటుకు గురై మృతి చెందాడు.
శ్రీనివాస్ మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు స్వగ్రామం హుస్నాబాద్‌కు తీసుకొచ్చారు. మృతుడి శ్రీనివాస్‌కు భార్య స్వరూప, కుమార్తెలు అనూష్క, అక్షయలు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అనుష్క తండ్రి అంత్యక్రియలు చేసి చితికి నిప్పు పెట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
చదవండి: ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్..మహిళా సర్పంచ్ మృతి
Tags : 1