ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్
Breaking News
డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య
Published on Tue, 05/27/2025 - 07:55
మియాపూర్(హైదరాబాద్): కుటుంబ సమస్యలతో పాటు ప్రేమ విఫలమై ఓ డ్యాన్స్ మాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కైలాసపూరికి చెందిన సాగర్ కుమార్ (17) ఇంటర్ వరకు చదువుకున్నాడు.
కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచి్చన అతను మియాపూర్‌లోని గ్లోకుల్ ప్లాట్స్‌ని డెలయిట్ డాన్స్ స్టూడియోలో డ్యాన్స్ మాస్టర్‌గా పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 25న రాత్రి స్టూడియో మూసివేసిన తర్వాత స్టూడియో యజమాని పరమేష్ అతడికి ఫోన్ చేసి స్టూడియో డోర్లను లాక్ చేయాలని సూచించాడు. సోమవారం మధ్యాహ్నం యజమాని పరమేష్ స్టూడియోకు వెళ్లి చూడగా సాగర్ కుమార్ ఓ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.
మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాగర్ కుమార్ స్టూడియోకు వచి్చనప్పటి నుంచి బాధపడుతూ ఉండేవాడని పది రోజుల క్రితం స్టూడియో యజమాని వంగాల పరమేష్ ఈ విషయమై అతడిని ప్రశి్నంచగా కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఓ అమ్మాయిని ప్రేమించి విఫలమైనట్లు తెలిపాడన్నారు. స్టూడియో యజమాని పరమేష్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags : 1