తెలంగాణను వీడని మోంథా

Published on Thu, 10/30/2025 - 07:03

మోంథా తుపాన్‌ మొత్తానికి వాయుగుండంగా బలహీనపడింది. సాయంత్రం కల్లా దీని ప్రభావం పూర్తిగా పోతుందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో రాగల కొన్ని గంటల్లో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలే పడనున్నాయని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం, అధికార యంత్రాగం అప్రమత్తమైంది. 

తెలంగాణలో మోంథా ఎఫెక్ట్‌తో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. 9 జిల్లాలకు ఆరెంజ్‌, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 35-45కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆరు జిల్లాలకు సెలవులు.. 
భారీ వర్షాల నేపథ్యంతో వరంగల్‌, సిద్ధిపేట, ములుగు, ఉమ్మడి కరీంనగర్‌, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. 

ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరిక
జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

మోంథా ప్రభావం ఇలా.. 
మోంథా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. భద్రాచలానికి 120కి.మీ... ఖమ్మంకు 180 కి.మీ... ఒడిశా మల్కన్‌గిరికి 130 కి.మీ. వాయుగుండంగా కేంద్రీకృతమైంది. సాయంత్రం కల్లా పూర్తి బలహీనంగా మారిపోనుంది.

సీఎం సమీక్ష
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)