Breaking News

తెలంగాణలో రెండ్రోజులు అతి భారీ వర్షాలు

Published on Tue, 12/05/2023 - 16:21

సాక్షి, హైదరాబాద్:  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్‌ Cyclone Michaung ప్రభావంతో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను కదలిక ఆధారంగా తాజాగా ఈ అప్‌డేట్‌ను అందించింది.  దీంతో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోని పలు జిల్లాలో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీర జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో వర్షం పడుతోంది. వర్షం కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. మంగళ(నేడు), బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.  

మిచౌంగ్‌ ప్రభావ దృష్ట్యా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు.  వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎస్‌  శాంతికుమారి సూచించారు.       భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు  ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు.  అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు.

ఇదీ చదవండి: తీవ్ర తుపాను మిచౌంగ్‌ ముంచేసింది

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు