ఒంటరిగా ఉంటున్నానని.. లక్షల్లో సంపాదిస్తున్నానని..

Published on Sat, 11/29/2025 - 02:31

సాక్షి, హైదరాబాద్‌: కల్లబొల్లి మాటలతో వల వేసి.. కలిసి పెట్టుబడి పెడితే మంచి లాభాలంటూ ఊదరగొట్టిన సైబర్‌ నేరగాళ్లు ఓ డాక్టర్‌ నుంచి 60 రోజుల వ్యవధిలో రూ.14.61 కోట్లు కొల్లగొట్టారు. సీఎంసీ మార్కెట్స్‌ ట్రేడింగ్‌ పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ లావాదేవీలు, ట్రేడింగ్‌ లింకుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన ప్రైవేట్‌ డాక్టర్‌ కె.మహేశ్వర్‌ రెడ్డికి ఆగస్టు 27న ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో మోనికా మాధవ్‌ పేరుతో ఫేస్‌బుక్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. తను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని తెలిపింది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌ ఉందని నమ్మించింది. తనను తాను సీఎంసీ మార్కెట్స్‌ ట్రేడింగ్‌ ప్రతినిధిగా పరిచయం చేసుకుంది. 

చాటింగులు, షేరింగులతో వల 
వాట్సాప్, టెలిగ్రామ్‌లో చాటింగులు, షేరింగ్‌లు చేసింది. ఈ క్రమంలోనే సీఎంసీ ట్రేడ్‌ మార్కెట్‌లో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది. తనతో కలిసి ఇన్వెస్ట్‌ చేయాలని సూచించింది. ఇదంతా సైబర్‌ నేరగాళ్లు చేస్తున్న పని అని డాక్టర్‌ గుర్తించలేకపోయారు. విడతల వారీగా పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభాలని ఫేక్‌ యాప్‌లో చూపుతూ ఈ నెల 26వ తేదీ వరకు 60 రోజుల వ్యవధిలో మొత్తం రూ.14.61కోట్లు డాక్టర్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా విఫలమవడంతో తాను  మోసపోయానని గుర్తించిన డాక్టర్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు. టీజీ సీఎస్‌బీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)