Breaking News

సాయంత్రం 4లోపే ఇంటికి వెళ్లండి.. ఐటీ ఉద్యోగులకు సూచన!

Published on Wed, 11/04/2026 - 11:45

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగులు, వాహనదారులకు ప్రయాణ ఇబ్బందులు తలెత్తకుండా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గురువారం వరకు ఐటీ సంస్థలు దశలవారీగా ముందస్తు లాగ్‌ఔట్స్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఉద్యోగులను విడతలవారీగా విధుల నుంచి పంపించాలని, వీలైనంత వరకు సాయంత్రం 4 గంటల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రహదారులపై తీవ్ర రద్దీ ఏర్పడే ప్రమాదం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. ఒకేసారి వేలాది మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు వస్తే ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రమవుతుందని వివరించారు.

వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మూడు రోజుల పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవాలని ఐటీ కంపెనీలు, సంస్థలకు సూచించారు. తమ సంస్థల చిరునామా, ముందస్తు లాగౌట్‌ అమలు చేయనున్న సమయాలను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఈ–మెయిల్‌ (cybtrcc @gmail.com) ద్వారా తెలియజేయాలన్నారు. ఆయా సంస్థల నుంచి అందే సమాచారాన్ని బట్టి ట్రాఫిక్‌ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.   
 
ఇదీ చదవండి: చికిత్స పొందుతూ కండక్టర్‌ ప్రవళిక మృతి


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)