Breaking News

తెలంగాణ రైతులకు అలర్ట్‌.. ఆ లింకుల్ని క్లిక్‌ చేయొద్దు

Published on Thu, 07/18/2024 - 15:40

హైదరాబాద్‌, సాక్షి: రుణమాఫీ సొమ్ము జమ అవుతున్న వేళ.. తెలంగాణ రైతుల్ని రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. అనవసరమైన లింకుల్ని క్లిక్‌ చేయొద్దని రైతుల్ని హెచ్చరిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కీలక సూచన చేసింది. 

గత కొంతకాలంగా వాట్సాప్‌లో ఏపీకే(APK) లింకులు పంపిస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఫోన్లు హ్యాక్‌ చేస్తున్నారు. ఆర్టీవో అధికారులు, బ్యాంకుల పేరిట ఆ లింకులు వస్తున్నాయి. అవి క్లిక్‌ చేసి చాలామంది మోసపోతున్నారు. 

ఈ క్రమంలో అలాంటి లింకులు వస్తే క్లిక్‌ చేయొద్దని తెలంగాణ రైతుల్ని సీఎస్‌బీ అప్రమత్తం చేస్తోంది. ఒకవేళ పొరపాటున లింకులు క్లిక్‌ చేసి ఎవరైనా డబ్బులు పొగ్గొటుకుంటే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతోంది.

మరోవైపు..  రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు, మెసేజ్ లు వస్తాయని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని తెలంగాణ పోలీసులు రైతులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, అలాగే.. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెపొద్దని రైతులకు అలర్ట్‌ జారీ చేసింది.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)