Breaking News

అన్నిటికీ ఒకటే క్యూర్‌

Published on Sat, 06/20/2026 - 01:38

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నగర ప్రజలు ఇకపై వివిధ ప్రభు త్వ విభాగాలకు చెందిన వివిధ సేవల చెల్లింపులను ఒకే యాప్‌ (క్యూర్‌–1) ద్వారా చేయొచ్చు. ఈ మేరకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌ ద్వారా   క్యూర్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో  ‘కామన్‌ యూనిఫైడ్‌ బిల్లింగ్‌ అండ్‌ కలెక్షన్‌ సిస్టం’ అమలుకు మార్గ దర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు, నీటి బిల్లులు, ట్రాఫిక్‌ చలాన్లు తదితర ప్రభుత్వ బకాయిలన్నింటినీ ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.

ప్రస్తుతం నగర ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన బిల్లులు, పన్నులు చెల్లించేందుకు వేర్వేరు పోర్టళ్లను వినియోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ప్రజలకు ఇబ్బందులు, శాఖలకు వసూళ్ల సమన్వయంలో సమస్యలు, ఆదాయ లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ యాప్‌ ద్వారా సమగ్ర చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. దీంతో చెల్లింపుల పారదర్శకత, జవాబుదారీతనం, వసూళ్ల సామర్థ్యం పెరగడంతో పాటు విభిన్న చెల్లింపు వ్యవస్థల అవసరం తొలగిపోనుంది. 

ఏ సేవలు అందుబాటులోకి?
మొదటి దశలో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు సంబంధించిన ఆస్తి పన్ను, ట్రేడ్‌ లైసెన్సులు, సెల్ఫ్‌ అసెస్‌మెంట్, సూపర్‌ స్ట్రక్చర్‌ ఫీజులు, ఖాళీ భూముల పన్ను (వీఎల్‌టీ) చెల్లింపులను అనుసంధానించనున్నారు. అలాగే టీజీ ఎస్పీడీసీఎల్‌ విద్యుత్‌ బిల్లులు, జలమండలికి సంబంధించిన వాటర్, సివరేజి చార్జీలు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపులు కూడా ఈ వేదికలోకి రానున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం సూచించే ఇతర సేవలను కూడా ఇందులో చేర్చనున్నారు. యాప్‌ నిర్వహణ బాధ్యతలను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ)కు అప్పగించనున్నారు.  

రోజువారీ సెటిల్‌మెంట్‌
యాప్‌ ద్వారా జరిగే అన్ని చెల్లింపులు మీ సేవ పేమెంట్‌ గేట్‌వే ద్వారా ప్రాసెస్‌ అవుతాయి. వసూలైన మొత్తా లు తాత్కాలికంగా కేంద్ర ఖాతాలో నిల్వ చేసి, టీ+0 లేదా టీ+1 విధానంలో సంబంధిత శాఖలకు బదిలీ చేస్తారు. పేమెంట్‌ వైఫల్యాలు, రీకన్సిలియేషన్‌ సమస్యలు, ఇతర సేవా వివాదాల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్‌  రెడ్రెస్సల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

పౌరులు క్యూర్‌ –1 యాప్,మై క్యూర్‌ యాప్, ఆయా  శాఖల పోర్టళ్ల ద్వారా ఫిర్యాదులు నమో దు చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖలు 90 రోజుల్లోపు క్యూర్‌–1  యాప్‌తో చెల్లింపు వ్యవస్థలోకి మారా ల్సి ఉంటుంది. కాగా.. ఒకే డిజిటల్‌ ఎకో సిస్టమ్‌ లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన క్యూర్‌ –1 యాప్‌ నగర పాలనలో డిజిటల్‌ సంస్కరణలకు కొత్త మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తు న్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలోని పౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని పేర్కొంటున్నారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)