Breaking News

సీఎస్‌ సర్వీసు 7 నెలలు పొడిగింపు

Published on Fri, 08/29/2025 - 05:55

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.రామకృష్ణారావు ఈ నెల 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీసును మరో 7 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అండర్‌ సెక్రటరీ భూపేందర్‌ పాల్‌ సింగ్‌ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 

ఏఐఎస్‌ (సీఎస్‌–ఆర్‌ఎం) రూల్స్‌–1960లోని రూల్‌–3ని ప్రయోగించడం ద్వారా ఏఐఎస్‌ (డీసీఆర్బీ) రూల్స్‌లోని 16(1) నిబంధనను సడలిస్తూ రామకృష్ణారావు సర్వీసును పొడిగించినట్టు కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. 1991 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రామకృష్ణారావు గత ఏప్రిల్‌ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

పొడిగింపు పొందిన రెండో సీఎస్‌
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి సీఎస్‌గా పనిచేసిన రాజీవ్‌ శర్మ పదవీ కాలాన్ని ఒకసారి 3 నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు పొడిగించేందుకు కేంద్రం అనుమతించింది. ఆ తర్వాత పదవీ కాలం పొడిగింపు పొందిన రెండో సీఎస్‌గా రామకృష్ణారావు నిలిచారు. గతంలో ఒక ప్రయత్నంలో మూడు నెలలు మాత్రమే సర్వీసు పొడిగించగా, రామకృష్ణారావు విషయంలో మాత్రం ఒకేసారి ఏడు నెలల సర్వీస్‌ పొడగింపునకు కేంద్రం అనుమతించడం గమనార్హం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)