Breaking News

నితిన్‌ గులాబానీపై మరో కేసు

Published on Fri, 07/10/2026 - 12:04

సాక్షి, హైదరాబాద్‌: సోమాజీగూడ కేంద్రంగా కేవీ జ్యువెలర్స్, నితిన్‌ జ్యువెలర్స్, కేవీవీ జ్యువెలర్స్, నితిన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థల్ని నిర్వహించిన నితిన్‌ గులాబానిపై నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) మరో కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన వ్యాపారి రూ.7.8 కోట్ల మేర మోసపోయానంటూ ఇచ్చిన ఫిర్యాదుతో దీన్ని రిజిస్టర్‌ చేశారు. ఇప్పటికే నగరానికి చెందిన నలుగురు జ్యువెలరీ దుకాణం యజమానుల్ని రూ.20.59 కోట్లకు మోసం చేసిన ఆరోపణలతో నితిన్‌పై ఓ కేసు నమోదైన విషయం విదితమే.

బెంగళూరులోని బెంగళూరు జ్యువెలరీ హౌస్‌ ముఖేష్‌ కుమార్‌ జైన్‌ నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చి 22న బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరిగిన ఆభరణాల ప్రదర్శనలో ముఖేష్‌ను నితిన్‌ రమేష్‌ గులాబానీ కలిశాడు. తాను హైదరాబాద్‌లోని మూడు సంస్థలకు యజమానని పరిచయం చేసుకున్నాడు. ముఖేష్‌ను తన స్టాల్‌కు తీసుకెళ్లిను నితిన్‌ వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. తొలినాళ్లల్లో బంగారు ఆభరణాలు సరఫరా చేసిన 30 రోజుల్లోపు నితిన్‌ చెల్లింపులు చేస్తుండేవాడు. రెండు లావాదేవీలను ఇలానే పూర్తి చేసి తనపై పూర్తి నమ్మకం తెచ్చుకున్నాడు.

ఈ ఏడాది మార్చి 30న రూ.3.68 కోట్ల విలువైన 2503.190 గ్రాముల బంగారు ఆభరణాలు, ఏప్రిల్‌ 1న రూ.3.16 కోట్ల విలువైన 2207.600 గ్రాముల బంగారు ఆభరణాలు సరఫరా చేశారు. ఈ సరుకుని ముఖేష్‌ వద్ద పని చేసే శ్రవణ్, సంజయ్‌ హైదరాబాద్‌ తీసుకువచ్చి నితిన్‌ జ్యువెలర్స్‌ కార్యాలయంలో అందించారు. ఆపై మే 19న రూ.4.41 కోట్ల విలువైన 2927.250 గ్రాముల బంగారు ఆభరణాలను ముఖేష్‌ స్వయంగా తీసువచ్చి ఇవ్వగా... జూన్‌ 2న రూ.2.90 కోట్ల విలువైన 1808.180 గ్రాముల బంగారు ఆభరణాలను నితిన్‌ గులాబానీ కార్యాలయంలో ముఖేష్‌ ఉద్యోగులు హరీష్, ధన్‌రాజ్‌లు అందించారు.

గరిష్టంగా 30 రోజుల్లో చెల్లింపులు చేయాల్సి ఉండగా నితిన్‌ అలా చేయలేదు. ముఖేష్‌కు చెల్లించాల్సిన రూ.13.81 కోట్ల బకాయిలో కేవలం రూ.5.95 కోట్లు మాత్రమే చెల్లించాడు. మిగిలిన రూ.7.86 కోట్ల కోసం పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ముఖేష్‌ బెంగళూరులో ఉండటంతో ఆయన ఉద్యోగులను పదేపదే హైదరాబాద్‌ వచ్చి నితిన్‌ను అడిగినా ఫలితం దక్కలేదు. ప్రతిసారీ నితిన్‌తో పాటు ఆయన సిబ్బంది త్వరలోనే మొత్తం చెల్లిస్తామని చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో నితిన్‌ తాను ఆస్పత్రిలో ఉన్నారని చెప్పి, బకాయితో పాటు ఆలస్యమైనందుకు నెలకు 2 శాతం వడ్డీ కూడా చెల్లిస్తానని నమ్మబలికాడు.

కొన్నాళ్లకు నితిన్‌ గులాబానీతో పాటు ఆయన సోదరుడు విపిన్, సిబ్బంది హరీష్, ధన్‌రాజ్‌ సింగ్‌ ప్రవర్తన పూర్తిగా మారిపోవడాన్ని ముఖేష్‌ గమనించారు. ఫోన్‌కాల్స్, వాట్సాప్‌ సందేశాలకు స్పందించడం మానేశారు. దీంతో జూన్‌ 17న ముఖేష్‌ స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి నితిన్‌ గులాబానీని కలిశారు. మరుసటి రోజు కనీసం రూ.2 కోట్లు చెల్లిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో మరుసటి రోజు ముఖేష్‌ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడు ఆ కార్యాలయం మూసి ఉండటం, నితిన్‌ మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉండటాన్ని గమనించారు. ఆయన ఉద్యోగుల ఫోన్లు కూడా స్విచ్‌ ఆఫ్‌లోనే ఉండటంతో ముఖేష్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన నితిన్‌ నివాసానికి వెళ్లి చూడగా అది తాళం వేసి ఉంది. మోసపోయానని గుర్తించిన బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?