Breaking News

సీఎం విజిట్‌ మంచిదే.. నిమజ్జనాలపై ఫోకస్‌ పెట్టాం: సీవీ ఆనంద్‌

Published on Sun, 09/07/2025 - 12:50

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు సీపీ సీవీ ఆనంద్‌. హైదరాబాదులో 1,40,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పుకొచ్చారు. గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగియడానికి పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని తెలిపారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈరోజు సాయంత్రం వరకు 900 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంటుంది. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం నిమజ్జనం త్వరగా చేపట్టడంతో మిగతా గణేష్ నిమజ్జన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాం. ఈసారి హైదరాబాదులో ఎక్కువ గణేష్ విగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కొన్ని విగ్రహాలు 40 అడుగుల వరకు ఎత్తులో ఉన్నాయి. గణేష్ నిమజ్జనం కార్యక్రమాలకు ప్రశాంతంగా కొనసాగడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, వాటర్ బోర్డ్ అధికారులు బాగా సహకరించారు.

గణేష్ విగ్రహాల దగ్గర ఆకతాయిల ఆట కట్టించడానికి ఈసారి షీ టీమ్స్ బాగా పనిచేశాయి. 170 మందిపై కేసులు నమోదు చేశాం. గణేష్ మండపాల దగ్గర అక్కడక్కడ గొడవలు జరిగాయి. ఐదుగురిపై కేసులు నమోదు చేశాం. హై రైజెడ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయగలిగాం. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకస్మిక పర్యటన చేయడం మంచిదే’ అని చెప్పుకొచ్చారు. 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)