Breaking News

ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చాల్సి ఉంది!

Published on Fri, 05/24/2024 - 08:46

సాక్షి, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన  సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ వేసింది. 8 రోజులు కస్టడీ కి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.

నేడు(శుక్రవారం) కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్‌ పెట్టింది. బినామీ ఆస్తులు, యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేయనుంది. 

ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. దీంతో ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చే పనిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు  డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.

ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్‌లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది.

ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్‌ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్‌ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)