Breaking News

జాతీయ రహదారిపై యువ జంట హల్‌చల్‌

Published on Tue, 07/15/2025 - 12:54

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ బెంగుళూర్‌ జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి యువ జంట హల్‌చల్‌ చేసింది. ద్విచక్ర వాహనంపై వెళుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను వెనుక వెళుతున్న ఓ వాహనదారుడు చిత్రీకరించి సోషల్‌ మాధ్యమంలో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 

దీంతో రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సిహెచ్‌.రాజు తన సిబ్బందితో  సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆదివారం అర్ధరాత్రి బెంగుళూర్‌ జాతీయ రహదారి అయిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీ ప్రాంతంలోని ప్‌లై ఓవర్‌ గుండా ద్విచక్ర వాహనంపై యువతీ, యువకుడు ఆరాంఘర్‌ చౌరస్తా మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వాహన నంబర్‌ ఆధారంగా మోటార్‌ రవాణా చట్టం నిబంధన మేరకు ఫైన్‌ విధించారు. 

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ... వాహన నంబర్‌ ఆధారంగా సదరు యువకుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అతడిని స్టేషన్‌కు రప్పించి వాహనం ఎవరిది.. వాహనం నడిపిన యువకుడికి లైసెన్స్‌ ఉందా తదితర విషయాలను విచారించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.  

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)