Breaking News

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Published on Thu, 03/27/2025 - 12:40

నాగర్‌ కర్నూల్‌: లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారి కుటుంబం పాలిట యమపాశమైంది. అప్పటివరకు నలుగురు(ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు) పిల్లలతో సరదాగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన భార్యభర్తలు సక్కభాయి (40), పాండు (45) 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 

వారికి నలుగురు పిల్లలు మధుమిత, మధురుషిత, యాద్విక్‌, యశిత్‌..పిల్లలున్నారు. సక్కుభాయి మహేశ్వరం మండలంలోని ఎన్‌డీతండాలో పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్‌పేట్‌లోని పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై సుక్కుభాయి తమ అమ్మగారి గ్రామమైన కొందుర్గులో ఉన్న తమ వ్యవసాయ పొలంలో జరుగుతున్న పండ్లతోట పనులను పరిశీలించి తిరిగి సాయంత్రం రామంతాపూర్‌కు బయల్దేరారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌ శివారు ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ అతివేగంగా ఢీ కొట్టింది.

 దీంతో సక్కుభాయి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను రఘుపతిపేటకు తరలించి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు ముగించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)