Breaking News

Hyderabad: ‘హరేకృష్ణ’ టెంపుల్‌.. 430 అడుగులు!

Published on Wed, 08/21/2024 - 09:18

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడానికి ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్‌ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ పేరుతో 430 అడుగుల ఎత్తులో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నారు. నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. శ్రీరాధా, కృష్ణుల అద్భుతమైన విగ్రహాలతో పాటు సీతారామచంద్రులు, గౌర నితాయి విగ్రహాలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు.

శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. ఈ ప్రాజెక్టులో కాకతీయులు, చాళుక్యులు, ద్రవిడ సంస్కృతి, విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ గోసేవ మండల్‌ ఈ ప్రాజెక్టుకు భూసేవక్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, మ్యూజియం, థియేటర్, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలపై బోధనలు చేసేందుకు భగవద్గీత హాల్స్‌ నిర్మించనున్నారు. 

ఇక, ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి అనంత శేష స్థాపన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే హరేకృష్ణ మూమెంట్‌ చైర్మన్‌ శ్రీమధు పండిట్‌ దాస ప్రభుజీ, అక్షయ పాత్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీసత్య గౌర చంద్ర దాస ప్రభు జీ తదితరులు పాల్గొననున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)