Breaking News

కాంగ్రెస్‌ పార్టీలో రాజుకుంటున్న వర్గపోరు

Published on Tue, 09/24/2024 - 12:42

జనగామ: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్సెస్‌ సీనియర్‌ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. 

కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరోవర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం.. పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకో ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీభవన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నా రు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

రెండు వర్గాలుగా విడిపోయి..
పార్టీ నాయకులు, శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయితీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నియామకం కొమ్మూరి వర్సెస్‌ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా, చినికి చినికి గాలివానలా మారింది. 

హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్‌ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యా దు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములును హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాహుల శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.25లక్షలు ఆఫర్‌ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా.. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టి పారేశారు. ‘అసలు శ్రీనివాస్‌రెడ్డి నా శత్రువు.. సోషల్‌ మీడియాలో నాకు వ్యతిరేఖంగా పోస్టులు పెడుతున్నాడు. అంభాడాలు వేస్తున్నాడు.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని’ కొమ్మూరి కోరడం గమనార్హం.

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..
కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు మరో వర్గానికి చెందిన సీని యర్‌ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్న కంచె రాములును కాదని డీసీసీ అధ్యక్షుడు మరో పేరును సూచించడంతో సీనియర్లు సీరియస్‌ అయ్యారు. అయినా కొమ్మూరి యువ నాయకు ల వైపే మొగ్గు చూపారు. ఈసారి బీసీ(ఏ) రిజర్వేషన్‌ ఉంది.. ఆ పదవి తనకే ఇవ్వాలని లోకుంట్ల ప్రవీణ్‌ పట్టు బడుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సవాల్‌ విసురుతుండంతో అధిష్టానం మార్కెట్‌ చైర్మన్‌ పదవి విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఏది ఏమైనా డీసీసీ అధ్యక్షుడు వర్సెస్‌ కంచె రాములు వర్గపోరు ఎటుదారి తీస్తుందో వేచిచూడాలి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)