Breaking News

మంత్రివర్గంలోకి అజహరుద్దీన్‌

Published on Thu, 10/30/2025 - 05:32

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వేళ అధికార కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అజహరుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. దానికి కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదం తెలిపింది. నవంబర్‌ 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలో గెలుపొందాలని రెండు పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. 

ఈ సమయంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదిపింది. అందులో భాగంగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని  నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేలా ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మహమూద్‌ అలీ హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మైనారిటీలకు కీలక ప్రాతినిధ్యం ఉండేది. 

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, పార్టీ పదవుల్లోనూ అంతగా అవకాశాలు రావడం లేదన్న ప్రచారం ఉంది. పైగా మైనారిటీల నుంచి వస్తున్న అసంతృప్తి నేపథ్యంలోనే అజాహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.  కేబినెట్‌ బెర్తులు 18: రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 18 మందికి అవకాశం ఉంటుంది. 

సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార సందర్భంలో ఆయనతోపాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ వెంకట్‌స్వామితోపాటు వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు దక్కాయి. దీంతో కేబినెట్‌ మంత్రుల సంఖ్య 15కు చేరింది. తాజాగా కేబినెట్‌లోకి అజాహరుద్దీన్‌ను తీసుకున్నా, మరో ఇద్దరికి మంత్రి పదవులకు అవకాశం ఉంటుంది.  

గవర్నర్‌ కోటాకు ఆమోదముద్ర ఎప్పుడో ? 
గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, కోదండరాం పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పంపింది. అయితే ఆ రెండు ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఇప్పటివరకు ఆమోదముద్ర వేయలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకున్నా మంత్రి పదవి కట్టబెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. 

ప్రస్తుత ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ ఓట్లతో జూబ్లీహిల్స్‌ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అజాహరుద్దీన్‌కు మంత్రి పదవిని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈనెల 31వ తేదీ నుంచి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌ టికెట్‌ అజాహరుద్దీన్‌కు ఇస్తారని మొదట్లో విస్తృత ప్రచారం జరిగినా, చివరకు బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్‌యాదవ్‌ను దక్కిన విషయం తెలిసిందే.  

ఆ ఇద్దరికి లేనట్టేనా..! 
మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసారీ నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశించినా, అవకాశం దక్కలేదు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో సామాజిక సమీకరణల నేపథ్యంలో అవకాశం దక్కలేదు. సుదర్శన్‌రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించినా నిరాశ మిగిలింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న కీలక నిర్ణయంతో మంత్రివర్గంలో అజాహరుద్దీన్‌కు మాత్రమే బెర్త్‌ లభించింది.  

సీఎంతో భేటీ అయిన మైనారిటీ నాయకులు  
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం వివిధ మైనారిటీ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు మైనారిటీ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రకటించారు. సీఎంతో భేటీ అయిన వారిలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, అజాహరుద్దీన్, ఫహీం ఖురేష్‌, ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అజాహరుద్దీన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)