Breaking News

సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ.. మూవీ పోస్టర్‌ విడుదల

Published on Mon, 03/10/2025 - 12:14

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి సినిమాకు సంబంధించిన పోస్టర్‌ విడుదలైంది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాజకీయాల నుంచి కొంత రిలాక్స్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘నాకు సినిమా ఆఫర్ వచ్చింది. లవ్‌స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్‌లో జగ్గారెడ్డి కనిపిస్తాడు. మాఫీయాను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో ఉంటా.. సినిమాల్లో కూడా ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను. పీసీపీ, ముఖ్యమంత్రికి చెప్పి సమయం తీసుకుని ఏడాది పాటు సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు. 

ఇక, తాజాగా జగ్గారెడ్డి పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. జగ్గారెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

నటనా రంగంలోకి అడుగు పెట్టనున్నకాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)