Breaking News

కాంగ్రెస్‌ ‘హామీ కార్డు’ 

Published on Sat, 03/11/2023 - 02:03

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు న్న వేళ రాష్ట్ర రైతాంగాన్ని ఆకట్టుకొనే ప్రయత్నా లను కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. రైతులకు చుక్కలు చూపుతున్న ధరణి పోర్టల్‌ సమస్యలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కారం చూపుతామంటూ ఏకంగా ‘హామీ కార్డులు’ జారీ చేస్తోంది.

పెద్దపల్లి నియోజకవర్గంలో పైలట్‌ ప్రా జెక్టు కింద ఈ ‘హామీ కార్డుల’జారీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్య వహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో ప్రారంభించిన టీపీసీసీ.. కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతోంది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.
 
ఫొటోతో కార్డు..: ధరణి పోర్టల్‌ లావాదేవీల ద్వారా రాష్ట్రంలోని 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో సమస్యలున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తోంది. దీనికి పరిష్కారంలో భాగంగా రైతుల ఫొటోలు, వివరాలతోపాటు ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలను కార్డు ముందు భాగంలో ముద్రిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఈ కార్డులను తహసీల్దార్‌ లేదా రెవెన్యూ అధికారులకు చూపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తోంది.

ఈ కార్డుల జారీ కంటే ముందు రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఐదుగురు ‘భూరక్షక్‌’లను నియమించాలని పార్టీ నిర్ణయించింది. భూరక్షక్‌లకు ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించి సమస్యల పరిష్కారంపై శిక్షణ ఇప్పించనుంది. వారు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ‘ధరణి అదాలత్‌’లు నిర్వహించనున్నారు. ఆయా గ్రామ పరిధిలో ధరణి పోర్టల్‌ ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతుల వివరాలు నమోదు చేసుకొని వారికి కార్డులు అందించనున్నారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ నేతృత్వంలోని ఓ బృందం ఈ కార్యాచరణ కోసం కొన్ని నెలలుగా అధ్యయనం చేస్తోందని, ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు, అభిప్రాయాల మేరకు ముందుకెళుతున్నామని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.   

మన భూమి–మన హక్కు: జైరాం రమేశ్‌ 
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధరణి అదాలత్‌లు నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ వెల్లడించారు. ధరణి పోర్టల్‌ అంటే ఒకరి స్థానంలో మరొకరి ఫొటో పెట్ట డం కాదని, ఎవరి భూమిపై వారికి హక్కులు కల్పించాలని, మన భూమి–మన హక్కు పేరుతో ఇందుకోసం కాంగ్రెస్‌ పోరాడుతుందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర భూసర్వే చేపడతామని, రైతుల పక్షపాతిగా వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని జైరాం రమేశ్‌ హామీ ఇచ్చారు. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)