Breaking News

పోటీ చేయాలా.. వద్దా?

Published on Sat, 11/29/2025 - 03:54

సాక్షి, పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో ఆశావహులతోపాటు వివిధ రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. కానీ సింగరేణి కార్మికుల్లో అయోమయం తొలగిపోవడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ సింగరేణి అధికారులు తప్ప కిందిస్థాయి కార్మికులు పోటీచేయొచ్చని స్పష్టత ఇచ్చినా.. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. 

దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో అయోమయం నెలకొంది. తొలివిడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఇప్పటివరకు సింగరేణి స్పష్టత ఇవ్వలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా.. 
ఎన్నికల్లో పోటీచేసేవారు తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలని సింగరేణి గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది. దీంతో చాలామంది పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసే వారు తప్పనిసరిగా ఉద్యోగానికి రాజీనామా చేయాలని, ఆ నిబంధన స్థానిక ఎన్నికలకు వర్తించదని కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. వాదోపవాదాలు విన్న కోర్టు.. కార్మికులకు అనుకూలంగా దిగువ స్థాయి కార్మికులు పోటీచేయొచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. 

అయినా, ప్రతీ స్థానిక ఎన్నికల సందర్భంగా పోటీ చేయకూడదని యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తోంది. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌లో మేనేజర్, సెక్రటరీలు తప్ప మిగిలిన ఉద్యోగులు పోటీ చేసేందుకు అర్హులని పేర్కొన్నా.. సింగరేణి ఇప్పటివరకు ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది. సింగరేణి పరిధిలో దాదాపు 42 వేల మంది కార్మికులు ఉన్నారు.  

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)