Breaking News

కరువు నేలకు జల సవ్వడి

Published on Fri, 01/10/2025 - 05:26

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కృష్ణమ్మ బిరబిరా తరలివచ్చి కరువు నేల దాహార్తిని తీర్చనుంది. దాదాపు 100 గ్రామాలను సస్యశ్యామలం చేయనున్న ఉదయసముద్రం (బ్రాహ్మణ వెల్లెంల) ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తైంది. నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. కాల్వల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తికాగానే కరువు నేలపై కృష్ణమ్మ ఉరకలెత్తనుంది. 
ఈ ప్రాంతానికి సాగునీటిని అందించటంతోపాటు భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్‌ సమస్యకూ పరిష్కారం లభించనుంది.

వైఎస్‌ చొరవతో ప్రాజెక్టు మంజూరు
నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టును 2007లో ఎమ్యెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుబట్టి సాధించారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో 2007లో ఈ ప్రాజెక్టుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, రూ.699 కోట్లతో 2008లో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2009లో పనులు ప్రారంభమయ్యాయి. ఉదయసముద్రం నుంచి అప్రోచ్‌ చానల్, సొరంగం, పంప్‌హౌస్‌ నిర్మాణం, మోటార్ల ట్రయల్‌ రన్, 486 ఎకరాల్లో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఈ రిజర్వాయర్‌లోకి 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను ప్రారంభించారు.  

ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇదీ..
ఏఎంఆర్‌పీలో భాగంగా నాగార్జునసాగర్‌ వెనుక జలాలు పానగల్‌లోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. దాని పైభాగాన ఉన్న దండంపల్లి గ్రామం సమీపం నుంచి అప్రోచ్‌ చానల్‌ ప్రారంభమై 6.9 కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామం వద్దకు నీరు వస్తోంది. అక్కడి నుంచి 10.625 కిలోమీటర్ల పొడవున సొరంగం ద్వారా నీరు నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామం వద్ద ఉన్న సర్జ్‌పూల్‌కు చేరుతుంది. అక్కడి నుంచి రెండు మోటార్లతో 86 మీటర్ల ఎత్తుకు పంపింగ్‌ చేసి 1.12 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రెండు డెలివరీ పైపుల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన కుడి, ఎడమ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు కొంత వరకే అయ్యాయి. వాటికి సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపు, కాల్వల తవ్వకం, లైనింగ్‌ చేయాల్సి ఉంది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)