Breaking News

హైదరాబాద్‌లోనే ఎక్కువ..!

Published on Sat, 12/14/2024 - 07:39

సాక్షి, సిటీబ్యూరో: సొంత స్థలాలున్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సంబంధిత అధికారులు ఆ పనుల్లో పడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకొచ్చే జిల్లాలు నాలుగున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ కూడా ఉంది. ఈ కార్యక్రమం తొలిదశలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. 

దీంతో ఏ జిల్లా పరిధిలో ఎందరున్నారో ప్రజాపాలన కార్యక్రమాల్లో అందిన దరఖాస్తుల్ని లెక్కలు తీశారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారు హైదరాబాద్‌ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనే జీహెచ్‌ఎంసీ వార్డులు కూడా ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. తర్వాత మేడ్చల్‌ జిల్లాలోని వారు ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల వంతున జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెరసి 84 వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఆర్థికసాయం అందనుంది.  

సర్వేయర్లకు సహకారం.. 
దరఖాస్తుదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి ‘ఇందిరమ్మ ఇళ్ల మొబైల్‌ యాప్‌’లో వివరాలు నమోదు చేసేందుకు సర్వేయర్లుగా జీహెచ్‌ఎంసీ సిబ్బందితోపాటు ఆయా జిల్లాల సిబ్బంది పని చేయనున్నారు.  క్షేత్రస్థాయిలో లబి్ధదారుల చిరునామాను గుర్తించేందుకు జిల్లాల సిబ్బందికి, కంటోన్మెంట్‌ సిబ్బందికీ జీహెచ్‌ఎంసీ సర్కిళ్లలో పనిచే స్తున్న యూసీడీ, ఎంటమాలజీ విభాగాల సిబ్బందితోపాటు రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు,తదితరులు సహకరించనున్నారు. మొబైల్‌ యాప్‌లో వివరాల నమోదు, అప్‌డేషన్‌ల కోసం  జీహెచ్‌ఎంసీ జోనళ్లస్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.  
 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)