Breaking News

TG: అమోయ్‌కుమార్‌పై ఈడీకి ఫిర్యాదుల వెల్లువ

Published on Sat, 10/26/2024 - 16:21

సాక్షి,హైదరాబాద్‌:ఐఏఎస్ అధికారి, మాజీ రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్ కుమార్ బాధితులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం లోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు అమోయ్‌కుమార్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా శనివారం(అక్టోబర్‌ 26) వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌ మరో ఫిర్యాదు చేశారు.

ధరణిని అడ్డం పెట్టుకొని అమోయ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడ్డారని, 200ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫ్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. 40 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నా మందీ మార్బలంతో వచ్చి వెళ్లగొట్టే యత్నం చేశారన్నారు. తమ భూములపై హైకోర్టు స్టే ఆర్డర్‌ ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఉదయం ఏడు గంటలకే  రిజిస్ట్రేషన్  కానిచ్చి రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారన్నారు.

సర్వేనెంబర్ 111 నుంచి 179 వరకు ఉన్న 460 ఎకరాల భూమిని కాజేసి సమారు 30 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఈడీకి ఫిర్యాదు చేశామని శంకర్‌హిల్స్ ఫ్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు,పెద్దల పాత్రపై దర్యాప్తు జరపాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: పదేళ్లలో అక్రమార్జన రూ.1000 కోట్లు 

 

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)