Breaking News

సిటీ కాప్స్‌.. గుడ్‌ మార్నింగ్‌ హైదరాబాద్‌!

Published on Thu, 08/29/2024 - 08:50

సాక్షి, సిటీబ్యూరో: ‘గుడ్‌ మారి్నంగ్‌ హైదరాబాద్‌...’ త్వరలో నగర పోలీసుల నోటి వెంట ఇలాంటి మాట వినిపించనుంది. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్‌సీఎస్సీ) కలిసి సిటీ పోలీసు విభాగం ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేయనుండటమే దానికి కారణం. ఇతర ఎఫ్‌ఎం రేడియోలకు దీటుగా, అన్ని హంగులతో త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రకటించారు.

నగర పోలీసు విభాగానికి ఇప్పటి వరకూ సొంతంగా ఎలాంటి రేడియో లేదు. అయితే  కొన్నేళ్లుగా వివిధ ఎఫ్‌ఎం రేడియోలతో పాటు ఇతర మీడియా సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. బోనాలు, గణేష్‌ ఉత్సవాలు వంటి కీలక ఘట్టాలతో పాటు సున్నితాంశాల పైనా ప్రజల్లో అవగాహన కలి్పంచడానికి ఈ వేదికల్ని వాడుకుంటున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ జామ్స్, రద్దీ రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎం రేడియోలకు అందిస్తున్న ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆ వివరాలను వారి ద్వారా శ్రోతలకు చేరుస్తున్నారు.  

ఇప్పటి వరకూ కేవలం వారికే..
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు అధికారులు 2019 అక్టోబర్‌లో ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేశారు. అందులో వినోద భరిత కార్యక్రమాలతో పాటు ఖైదీలకు ఉన్న హక్కులు, పెరోల్‌ నిబంధనలు తదితరాలను ప్రచారం చేస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ సెంట్రల్‌ జైలు అధికారులు సైతం 2021 డిసెంబర్‌లో ఓ రేడియోను ప్రారంభించారు. ఈ రెండూ ఖైదీల ఆధ్వర్యంలో నడిచేవే కావడం గమనార్హం. ఇండియన్‌ ఆర్మీ సైతం ఉత్తర కాశ్మీర్‌లో తొలి రేడియో స్టేషన్‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బారాముల్లా, ఉరి సెక్టార్లలో రెండింటికి విస్తరించింది.

వినోదంతో పాటు అవగాహన..
నగర పోలీసు విభాగం ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ రేడియో అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హెచ్‌సీఎస్సీతో కలిసి రూపుదిద్దుతున్నారు. ఈ రేడియోలు పాటలు వంటి వినోదభరిత కార్యక్రమాలకు సమప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు నగరవాసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా ట్రాఫిక్‌ నిబంధనలు, స్థితిగతులు, రోడ్డు భద్రత అంశాలకు పెద్దపీట వేసేలా తమ కమ్యూనిటీ రేడియో ఉండనుందని కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రేడియో నిర్వహణ బాధ్యతల్ని హెచ్‌సీఎస్సీ చేపట్టనుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)