Breaking News

ప్యాషన్‌ప్లస్‌ బైక్‌లో కట్లపాము

Published on Fri, 08/22/2025 - 08:43

నాగర్‌కర్నూల్ జిల్లా: మండలంలోని ఎల్లూరుకుకి చెందిన యువకుడు గణేశ్‌ బైక్‌లో కట్లపాము దాక్కుంది. ఎల్లూరు నుంచి కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గణేశ్‌ ప్యాషన్‌ప్లస్‌ బైక్‌పై గురువారం ఉదయం భయలుదేరాడు. పట్టణంలోని ద్వారకా లాడ్జ్‌ ముందు రోడ్డుపై వెళ్తుండగా బైక్‌ ముందు భాగంలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. 

అనుమానం వచ్చి బైక్‌ను ఆపుకొని చూడగా కట్ల పాము కనిపించింది. దాన్ని భయటకు తీసేందుకు కొద్దిసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని మెకానిక్‌ షాపు వద్దకు తీసుకెళ్లాడు. మెకానిక్‌ సద్దాం బైక్‌ పార్ట్స్‌ విప్పి పామును భయటికి లాగాడు. ఈ పాము దాదాపు మూడున్నర ఫీట్ల మేర పొడవు ఉంది. రాత్రి ఇంటిముందు పార్కుచేసిన సమయంలో బైక్‌లోకి పాము ఎక్కి ఉండొచ్చని గణేశ్‌ చెప్పాడు. పామువల్ల ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Videos

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)