Breaking News

జోగు రామన్న హౌజ్‌ అరెస్ట్‌.. సీఎం రేవంత్ పర్యటనతో టెన్షన్

Published on Fri, 01/16/2026 - 07:01

సాక్షి, అదిలాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్యటనను ఎలాగైనా అడ్డుకుని తీరతామంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు జిల్లాల ఎస్పీల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్‌ సవాల్‌ చేసింది. దీంతో.. ఆ పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నను అర్ధరాత్రి హౌజ్‌ అరెస్ట చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా అటు వైపు రానివ్వకుండా ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. 

సీఎం రేవంత్‌ తన పర్యటనలో భాగంగా.. అదిలాబాద్ నియోజకవర్గంలో కొరట చనక మ్యారేజ్ పంప్ హౌస్‌ను ప్రారంభిస్తారు. ఆపై నిర్మల్ జిల్లా మామడ మండలంలో సదర్ మార్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం.. నిర్మల్ టౌన్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)