Breaking News

అందెశ్రీ నాకు అత్యంత ఆప్తుడు: సీఎం రేవంత్‌

Published on Sat, 11/22/2025 - 20:12

హైదరాబాద్: ఇటీవల కన్నుమూసి ప్రజాకవి అందెశ్రీ తనకు అత్యంత ఆప్తుడని, తన మనసుకు దగ్గరి వాడని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఈరోజు(శనివారం, నవంబర్‌ 22వ తేదీ) అందెశ్రీ సంస్మరణ సభలో మాట్లాడిన సీఎం రేవంత్‌.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. ఎంత అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారు. నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలింది..

సమైక్యవాదాలకు వ్యతిరేకంగా గద్దర్, గూడా అంజన్న, అందెశ్రీ, గోరేటి వెంకన్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారు.. బడి మొహం ఎరుగని అందెశ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారు. ప్రతి తెలంగాణ గుండెకు జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ చేర్చారు. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత. తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్, అందెశ్రీ కోరుకున్నారు. అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం.. ఆయ‌న‌ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నాం, ఆయన పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)