Breaking News

ఫాక్స్‌కాన్‌ను మరింత విస్తరించండి

Published on Tue, 10/15/2024 - 05:23

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణ చేపట్టాలని ప్రముఖ సెల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, లిథియం బ్యాటరీల తయారీకి సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీ, ఆవిష్కరణలకు రాష్ట్రంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని వివరించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫోర్త్‌సిటీలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్‌ పరిశ్రమను ఆయన సందర్శించారు.

గంటకు పైగా అక్కడ గడిపిన ఆయన ఫ్యాక్టరీ ఏర్పాటులో పురోగతిని పరిశీలించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కంపెనీ ఉత్పత్తులు, నిరుద్యోగ యువతకు కల్పించనున్న ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ ప్రస్తుత, భవిష్యత్తు కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోడ్పాటునందిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ సీఈఓ, చైర్మన్‌ సిడ్నీ లూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రాజెక్టు పురోగతిని సీఎంకు వివరించారు.

కంపెనీ నిర్వహణకు సంబంధించిన కొన్ని సమస్యలను ఆయన ప్రస్తావించగా, వాటి సత్వర పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్‌ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడంలో భాగంగా సీఎం రేవంత్‌ ఈ పర్యటనను చేపట్టారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)