Breaking News

తెలంగాణ అభివృద్ధికి మూడు సూత్రాలు: సీఎం రేవంత్‌

Published on Sun, 11/30/2025 - 21:12

సాక్షి, హైదరాబాద్‌: గ్లోబల్‌ సమ్మిట్‌లో పాలసీ డాక్యుమెంట్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజన్‌ డాక్యుమెంట్‌కు తెలంగాణ రైజింగ్‌ 2047 అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.

‘‘విజన్‌  డాక్యుమెంట్‌లో లక్షలాది మందిని భాగం చేశాం. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్నదే మా లక్ష్యం. ఐఎస్‌బీ, నీతి ఆయోగ్‌ సంస్థల సలహాలు కూడా తీసకున్నాం. స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను మూడు విభాగాలుగా తీసుకున్నామని వివరించారు. కోర్ అర్బన్, రీజియన్ ఎకనామిగా హైదరాబాద్ మాడిఫికేషన్ చేశారు. ఓఆర్‌ఆర్ పరిధిలో మున్సిపల్‌ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు  ఉండడం వల్ల వ్యవస్థల మధ్య సమన్యాయం లోపిస్తుంది. అందుకే కోర్ అర్బన్ రీజియన్ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి  పేర్కొన్నారు.

‘‘కాలుష్య రహితనగరంగా హైదరాబాద్‌ను మారుస్తాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను తరలిస్తాం. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ను తీసుకొస్తున్నాం. వరంగల్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెంతో పాటు రామగుండంలో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం. కోర్‌, ప్యూర్‌, రేర్‌ రీజియన్లుగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. సమగ్రంగా మూడు రీజియన్ల అభివృద్ధి చేపడతాం. సర్వీస్‌ సెక్టార్‌గా కోర్‌ అర్బన్‌ రీజియన్‌ అభివృద్ధి చేస్తాం. ఓఆర్‌ఆర్‌, ట్రిపుల్‌ ఆర్‌ మధ్య ప్రాంతాన్ని పెరీ అర్బన్‌ రీజియన్‌గా గుర్తించాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)