Breaking News

హైదరాబాద్‌: వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Published on Thu, 05/16/2024 - 20:30

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులతో మాట్లాడిన సీఎం.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

బంజారాహిల్స్‌లోని ఉదయ్ నగర్ ప్రాంతంలో వర్షం ధాటికి దెబ్బతిన్న నాలా ప్రాంతాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. నాలా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. మూసాపేట, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌  బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్‌, గచ్చిబౌలి, చార్మినార్‌, మలక్‌పేట్‌, నాగోల్ కుండపోత వర్షం కురిసింది.

భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్‌పేట్‌ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపునీరు చేరింది. రైల్వే అండర్‌ పాస్‌ కింద వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తే రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)