Breaking News

ప్రజాపాలనపై నేడు సమీక్ష

Published on Mon, 01/08/2024 - 00:59

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపాలన సాగిన తీరు, వచ్చిన దరఖాస్తుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇది అధికారిక మంత్రివర్గ భేటీ కాదని, అందుబాటులో ఉన్న మంత్రులు దీనికి హాజరుకావాలని కోరినట్లు సమాచారం. కాగా ప్రజాపాలనలో ఎక్కువగా దరఖాస్తులు దేని కోసం వచ్చాయి? వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలపై చర్చిస్తారని తెలిసింది. ప్రభుత్వం ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాపాలనలో పాల్గొని దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో వాటి కంప్యూటరీకరణ, దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ తదితర అంశాలను చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

చేయూత పథకం కింద పింఛన్‌ను రూ.4,000కు పెంచడం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుల్లో అవకతవకలకు సంబంధించి న్యాయ విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం తదితరాలపై కూడా చర్చించనున్నట్లు చెబుతున్నారు. ఇక నెలరోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన వచ్చిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నెలరోజుల పాలన, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మరింత ఘాటుగా స్పందించడానికి ఏమి చేయాలన్న అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. 

1.11 కోట్ల కుటుంబాల నుంచి దరఖాస్తులు 
గతనెల 28వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు 8 పనిదినాల్లో కొనసాగిన ప్రజాపాలనలో మొత్తం 1.11 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారి ద్వారా 1,25,84,383 దరఖాస్తులు అందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 12,769 గ్రామ పంచాయతీలతో పాటు, 3,623 మునిసిపల్‌ వార్డులు/డివిజన్లలో ఈ ప్రజాపాలన నిర్వహించినట్లు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తంలోని ఆరు గ్యారంటీల కింద మొత్తం 1,05,91,636 దరఖాస్తులు రాగా.. ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 అందాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)