Breaking News

రేషన్‌ కార్డులు, కొత్త పథకాలపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

Published on Sat, 01/25/2025 - 12:55

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. రేషన్‌కార్డులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అలాగే, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. ఇలా నాలుగు పథకాలను రేపు(ఆదివారం)లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు సీఎం తెలిపారు.

తెలంగాణలో రేపు ప్రారంభించే నాలుగు పథకాలపై సీఎం రేవంత్‌ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో రేవంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్లుగా గ్రామ సభలు లేకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ ఒకటి, రెండు రోజులు ఆలస్యం అయినా రేషన్ కార్డులు వస్తాయి. అధికారులు సమయస్పూర్తితో ప్రజలకు సమాధానం చెప్పాలి. చివరి లబ్దిదారుడి పేరు లిస్టులో చేర్చే వరకు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.

రేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నాం.  హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయండి. నాలుగు పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండల స్థాయి అధికారులను నియమించాలి. ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్ధిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. మార్చి 31లోపు నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలి. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. 

రేపు తెలంగాణలో నాలుగు పథకాలు ప్రారంభం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)