Breaking News

మీ చేతుల్లోనే రాష్ట్ర భవిత

Published on Sat, 08/03/2024 - 02:12

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర భవిష్యత్‌ టీచర్ల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ఉపాధ్యాయులు తేనెతుట్టె వంటి వారని.. వారికి ఎవరైనా అపకారం చేస్తే తేనెటీగల్లా ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్యానించా రు. తమ ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో సీఎం ఆతీ్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ముందుంటాం. 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 30వేల మంది టీచర్ల పదోన్నతులు చేపట్టడం గర్వకారణం. బడ్జెట్‌లో విద్యారంగానికి 10% కేటాయించాలనుకున్నా.. హామీల అమలు దృష్ట్యా 7.3% నిధులే ఇవ్వగలిగాం. 

స్కూళ్లలో దారుణ పరిస్థితులు.. 
గురుకులాలతో కలిపి రాష్ట్రంలో 30వేల ప్రభుత్వ స్కూళ్లుంటే వాటిలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే ప్రైవేటు స్కూళ్లు 10వేలు ఉంటే వాటిలో 33 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు స్కూళ్లలో గొప్ప టీచర్లున్నారా? టెన్త్, ఇంటర్‌ ఫెయిలైన వాళ్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. ఎక్కడో లోపం ఉంది. దీనికి ప్రభుత్వ విధానాలూ కారణమే. మౌలిక వసతులు లేక విద్యార్థులు ప్రైవేటుబాట పడుతున్నారు.

మహిళా టీచర్లు పనిచేసే ప్రాంతాల్లో కూడా టాయిలెట్లు లేవు. కొన్నిచోట్ల స్కూళ్లలో పశువులను కట్టేసే పరిస్థితి. మేం పాఠశాలలను మెరుగుపరిచే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించాం. ప్రతీ ప్రభుత్వ స్కూల్‌కు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. పారిశుధ్య కారి్మకులను నియమిస్తాం. 

మీరే అంబాసిడర్లు.. 
తెలంగాణ సాధనలో టీచర్ల పాత్ర కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. టీచర్లతో పెట్టుకోవద్దని చాలామంది నాకు సలహా ఇచ్చారు. కానీ వారిలో విశ్వాసం నింపుతాననే నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదల భవిత టీచర్ల చేతుల్లోనే ఉంది. గత ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు 2 లక్షల మేర తగ్గాయి. అందువల్ల టీచర్లు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపడం ఆత్మగౌరవంగా భావించే పరిస్థితి తేవాలి..’’అని సీఎం రేవంత్‌ కోరారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. 

పేరుకేనా ముఖాముఖి: టీచర్ల అసంతృప్తి 
ప్రమోషన్లు పొందిన వారితో సీఎం ముఖాముఖి అని చెప్పి అధికారులు తమను తీసుకొచ్చారని.. కానీ ఒక్కరికైనా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని సమావేశం అనంతరం టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి విద్యాశాఖ అధికారులు వారం రోజుల నుంచే ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఉపాధ్యాయులను తరలించేందుకు ప్రతీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాటు చేశారు. దీంతో టీచర్లు ఏమేం మాట్లాడాలో ముందే సిద్ధం చేసుకున్నారు.

కనీసం జిల్లాకు ఒకరినైనా సీఎంతో మాట్లాడిస్తారని భావించామని.. కానీ సమావేశం కేవలం ప్రసంగాలకే పరిమితమైందని టీచర్లు పేర్కొన్నారు. గతంలో చెప్పినవే ఇప్పుడూ చెప్పారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా విద్యా రంగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచి్చన సీఎంకు పీఆరీ్టయూటీఎస్‌ నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)