Breaking News

ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి: సీఎం రేవంత్‌

Published on Tue, 11/05/2024 - 06:05

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయా­ల­ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రాధాన్యతాంశంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వార్తా కథనాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 

కాగా ఉమ్మడి జిల్లాలకు గతంలో నియమించిన ప్రత్యేకాధికారులకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 1న ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. 

జిల్లాల ప్రత్యేకాధికారులు వీరే:  
ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల : కృష్ణ ఆదిత్య 
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల : ఆర్వీ కర్ణన్‌  
నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట : అనితా రామచంద్రన్‌ 
నిజామాబాద్, కామారెడ్డి : డాక్టర్‌ ఎ.శరత్‌  
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి : డి.దివ్య 
మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ : ధరావత్‌ రవి  
వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ : టి.వినయ కృష్ణారెడ్డి  
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట : హరిచందన దాసరి 
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం : కె.సురేంద్ర మోహన్‌  

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)