Breaking News

రుణమాఫీ ‘లెక్క’ తీయండి!

Published on Tue, 06/11/2024 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల పంట రుణాలు మాఫీ చేయడానికి అవసరమైన లెక్క అంతా సిద్ధం చేయాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. పంట రుణాల మాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో రేవంత్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయిలో రైతుల వివరాలను సేకరించి, అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్‌ డేట్‌ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

స్పష్టమైన ప్రణాళికతో రండి.. 
బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాల మాఫీకి సంబంధించిన డేటా, అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. 

ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరాలని తేలి్చచెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ఒకేసారి మాఫీతో ఇబ్బంది అంటూ..! 
రుణమాఫీకి నిధుల జమ విషయంలో ఇబ్బందులను కొందరు అధికారులు సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకొచి్చనట్టు తెలిసింది. సుమారు రూ.35 వేల కోట్ల వరకు నిధులను జమ చేయడం అంత సులువైన విషయం కాదని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. 

రుణాలున్న ప్రతీ రైతుకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు తయారు చేయాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇప్పటివరకు కొన్ని బ్యాంకుల నుంచి రైతు రుణాల సమాచారం వచి్చందని, మిగతావాటి నుంచి కూడా డేటా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అయితే రుణమాఫీకి అర్హులైన రైతులు ఎంతమంది ఉంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)