Breaking News

తెలంగాణ అభివృద్ధికి మెగా ప్లాన్‌

Published on Mon, 02/19/2024 - 05:43

హఫీజ్‌పేట్‌ (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విజన్‌–2050 దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత 30 ఏళ్లుగా రాజకీయా­లు ఎలా ఉన్నా అప్పట్లో పనిచేసిన సీఎంలు చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌­లు గత ప్రభుత్వాల నిర్ణయాలను మరింత పకడ్బందీ ప్రణాళికలతో అమలు చేయడం వల్లే ఔటర్‌రింగు రోడ్డు, అంతర్జాతీయ స్థాయి వి­మా­నాశ్రయం, హైటెక్‌ సిటీ వంటివి అందు­బా­టులోకి వచ్చాయని అన్నారు.

దేశమే కా­కుం­డా ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూ­సే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ దేశంలోనే ఐదవ మెట్రోపాలిటన్‌ సిటీగా గుర్తింపు పొందిందని చెప్పారు. దీన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్నదే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని, అందరి సలహాలు, సూచనలతో అందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. తొందరపాటు చర్యలతో మేడిగడ్డ తరహాలో కానివ్వబోమని అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లిలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ ప్రాంతంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 

ఫార్మా సిటీ స్థలంలో కొత్త నగరం 
‘వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలోని ఓఆర్‌ఆర్, రీజనల్‌ రింగురోడ్డు మధ్య ఇటు, అటు ప్రాంతాలను ఎంపిక చేసి అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌ ప్రాంతాలుగా విభజిస్తాం. చైనా తరహాలో 10 నుంచి 15 శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తాం. వాటిల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. ఫార్మాసిటీని రద్దు చేస్తామనే అపోహ ఉంది. అది నిజం కాదు. ఫార్మా సిటీకి కేటాయించిన స్థలంలో కొత్త నగరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఒకేచోట ఫార్మాసిటీ అని కాకుండా విభిన్న ప్రాంతాల్లో కాలుష్య రహిత ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తాం. ఆస్పత్రులు, స్కూళ్ళు, షాపింగ్‌మాల్స్, ఇతర అన్ని రకాల సదుపాయాలుండేలా చూస్తాం..’అని సీఎం తెలిపారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ రైలు సౌకర్యం 
‘మెట్రో రైలు సౌకర్యం మరింత మందికి చేరువలో ఉండేలా చేయాలనే సంకల్పంతో కొత్త మార్గాలను రూపొందించాం. మొదటగా ఎయిర్‌పోర్టుకు, మియాపూర్‌ నుంచి ఆర్‌ïసీ పురం వరకు, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి కూడలి మీదుగా అమెరికన్‌ కాన్సులేట్‌ భవనం వరకు మెట్రో ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ సమయంలో చుట్టూ రైలు సౌకర్యం ఏర్పాటు చేసేలా చూస్తాం..’అని రేవంత్‌ చెప్పారు.  

ఫైర్‌ విభాగంలో ఖాళీల భర్తీ 
‘ప్రపంచంలో ఎక్కడైనా ల్యాండ్‌ మార్క్‌లు నిర్మించేది బిల్డర్లు, కాంట్రాక్టర్లే. వారి సమస్యలు ఏమి ఉన్నా పరిష్కరించేందుకు, వారికి అందుబాటులో ఉండేందుకు సిద్ధం. నగరాభివృద్ధిలో ఫైర్‌ విభాగం పాత్ర ఎంతో ఉంది. 50–60 అంతస్తుల భవనాలకు ఎన్‌ఓసీ ఇవ్వడంలో వారి పాత్ర కూడా ఉంటుంది. కానీ వారికి భవనం లేకపోవడం విడ్డూరం. క్రెడాయ్‌ (భారత రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ సంఘాల సమాఖ్య) ముందుకొచ్చి భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయం.

క్రెడాయ్‌ వారి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధం. ఫైర్‌ విభాగంలో ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. పోలీస్‌ విభాగం తరహాలో ఫైర్‌ సిబ్బంది అందరికీ న్యాయం చేసేలా చూస్తాం..’అని రేవంత్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, క్రెడాయ్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి, ఫైర్‌ విభాగం అదనపు డీసీ నాగిరెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)