Breaking News

పకడ్బందీ వ్యూహాలతో పనిచేయాలి

Published on Fri, 02/21/2025 - 04:57

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పకడ్బందీ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ నేతలు, కేడర్‌ను సిద్ధం చేస్తోంది. కరీంనగర్‌– ఆదిలాబాద్‌– నిజామాబాద్‌–మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలపై వరుసగా రెండోరోజు గురువారం కాంగ్రెస్‌ పార్టీ జూమ్‌ సమావేశం నిర్వహించింది. 

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీగా ప్రచార వ్యూహం రూపొందించుకోవాలని, ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించాలని సూచించారు. యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలని, ఓటర్లకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ వారిని పోలింగ్‌ బూత్‌కు తీసుకెళ్లి ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులకు విస్తృతంగా ప్రచారం చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా పని చేయాలని కోరారు.

ప్రతి ఓటూ కీలకమే..:      మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా సీరియస్‌గా తీసుకోవాలని, ఎలిమినేషన్‌ ప్రక్రియలో ప్రతి ఓటు చాలా కీలకమైందని సీఎం చెప్పారు. ఓటర్‌ మ్యాపింగ్‌ చేయడం, ఓటర్లను ప్రత్యేకంగా కలవడం లాంటి అంశాలు చాలా ముఖ్యమైనవని, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పారు. 

గాంధీభవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ పెట్టి నిరంతరం పర్యవేక్షించాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక చాలా కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని కోరారు. 

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌చార్జీలు, యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.  
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)