Breaking News

‘ఫ్యూచర్‌సిటీ’కి సీఎం రేవంత్‌ శంకుస్థాపన

Published on Sun, 09/28/2025 - 12:41

సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ ఫ్యూచర్‌సిటీకి పునాది రాయి పడింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌ పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. 

సుమారు 15 వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తికానుంది. అనంతరం ఫ్యూచర్‌సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు ఎఫ్‌సీడీఏ అధికారులు అనుమతులివ్వనున్నట్లు సమాచారం. రావిర్యాల నుంచి అమన్‌గల్‌ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్‌-1నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంరేవంత్‌తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా, ఉద్యోగ అవకాశాల కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి మోడల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మొత్తం 30 వేల ఎకరాల్లో.. 15,000 ఎకరాలు ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి, మరో 15,000 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్గా(హరిత ఊపిరి)గా కేటాయించింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)