Breaking News

గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం: సీఎం రేవంత్‌

Published on Sat, 12/14/2024 - 13:42

సాక్షి, చిలుకూరు: చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్‌పై పెట్టేదే అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఈ క్రమంలోనే తెలంగాణలోని గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నట్టు సీఎం చెప్పారు. అలాగే, మల్టీ  టాలెంటెడ్‌ స్టూడెంట్స్‌ ప్రభుత్వ ‍స్కూల్స్‌ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో హాస్టల్స్‌, గురుకులాల్లో విద్యార్థులకు కామన్‌ డైట్‌ ప్లాన్‌ ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..‘గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్‌ ప్లాన్‌ ఇస్తున్నాం. హాస్టల్స్‌, గురుకులాల్లో కామన్‌ డైట్‌ ప్లాన్‌ ప్రారంభమైంది. మెస్‌ మెనూలో బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, స్నాక్స్‌, డిన్నర్‌ ఉంటుంది. వారం రోజుల్లో ఐదు రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయించాం.

తెలంగాణలో 26వేల ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో విద్యా ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే రాణిస్తారనే అపోహ ఉండేది. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ అంటే మల్టీ టాలెంటెడ్‌. 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 11 లక్షల మంది చదువుతుంటే.. తక్కువున్న ప్రైవేటు స్కూల్స్‌ 33 లక్షల మంది ఎందుకు చదువుతున్నారు?. మల్టీ టాలెంటెడ్‌ స్టూడెంట్స్‌ ప్రభుత్వ ‍స్కూల్స్‌ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలి. చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్‌పై పెట్టేదే.

గురుకులాలు, హాస్టల్స్‌లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది?. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రతీనెలా పదో తేదీలోపు డైట్‌ ఛార్జీలు చెల్లిస్తాం’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నాం : సీఎం రేవంత్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)