Breaking News

రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు.. 14 నెలల్లో అతిపెద్ద విజయం

Published on Wed, 01/29/2025 - 00:45

సాక్షి, హైదరాబాద్‌: ‘తమ అనుచరులు, తమ దగ్గరున్న అక్రమ నిధులతో తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌పై అపోహలు, అనుమానాలు సృష్టించేలా కొంతమంది విష ప్రచారం చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. కానీ ప్రపంచ దిగ్గజ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో ఈ కుట్రలు, కుతంత్రాలు పటాపంచలయ్యాయి. 

మేము అధికారం చేపట్టిన 14 నెలల్లో ఇదో పెద్ద విజయం. అమెజాన్‌ రూ.60 వేల కోట్లు, సన్‌ పెట్రోకెమికల్స్‌ రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తం 25 సంస్థలతో ఎంఓయూలు కుదిరాయి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో సహచర మంత్రులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవలి దావోస్, సింగపూర్‌ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడుల వివరాలను వెల్లడించారు.  

ప్రవీణ్‌కుమార్‌ది బానిస మనస్తత్వం 
‘మేము స్వరాష్ట్రం, స్వదేశం, విదేశాల్లోని వారి దగ్గరున్న సొమ్మును పెట్టుబడులుగా మార్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయనే ఉద్దేశంతో దావోస్‌కు వెళ్లాం. కానీ ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. 

ఇక్కడి డబ్బులు తీసుకెళ్లి లండన్‌లో పెట్టుబడులు పెట్టారు..’ అంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారిపై తాము కేసులు పెట్టామని చెప్పారు. ఫార్ములా ఈ–రేసు వ్యవహారంలో తనపై బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఆయన స్పందించారు. తనపై ఫిర్యాదు చేసిన ఆయనది బానిస మనస్తత్వం అని, ఏదో ఒకరోజు ఆయన బానిస సంకెళ్లు తెంచుకోవాలని సూచించారు.  

అమీర్‌పేట సెంటర్‌లో జరిగితేనే ఒప్పందమా? 
‘రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే వారికి అక్కసు, కడుపులో మంట ఎందుకు? మేము ఎక్కడో ఓ చోట విఫలమైతే చూసి పైశాచిక ఆనందం పొందాలనేదే వారి ఉద్దేశం. మహారాష్ట్రలోని రిలయన్స్‌ ఇండస్ట్రీతో ఆ రాష్ట్ర సీఎం దావోస్‌లో ఒప్పందం చేసుకుంటే ఎవరూ ప్రశ్నించలేదు. కానీ తెలంగాణలోని (మేఘా) కంపెనీతో మేము దావోస్‌లో ఒప్పందం చేసుకుంటే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అమీర్‌పేట సెంటర్‌లో జరిగితేనే ఒప్పందమా? శ్వేతపత్రం అంటే ఏమిటో తెలియకుండా దాన్ని విడుదల చేయాలంటున్నారు. అన్ని ఒప్పందాల వివరాలు, ఫోటోలను కూడా ఇచ్చాం. 

అవే శ్వేతపత్రం. కొత్తగా తీసుకువచ్చిన ఎనర్జీ పాలసీలో ఓపెన్‌ యాక్సెస్‌ విధానంలో విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించడంతో డేటా సెంటర్ల ఏర్పాటుకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి..’ అని సీఎం తెలిపారు. ‘పెళ్లి చూపులు అయ్యాయి. లగ్న పత్రిక రాసుకున్నం. మిగతా కార్యక్రమాలు ముందు ఉన్నయి.’ అని వ్యాఖ్యానించారు. 

‘తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అలాగే దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ మారాలి. రాష్ట్రాన్ని ట్రిలియన్‌ డాలర్‌ ఎకనామీకి తీసుకెళ్లాలని నిరంతరం కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు తెచ్చి ఆదాయంలో అగ్రస్థానంలో పెడతాం..’ అని రేవంత్‌ చెప్పారు.  

ఇటీవల అటెన్షన్‌ సీకింగ్‌ అనే జబ్బు కనిపెట్టారు 
‘ఈ మధ్య పరిశోధనలో అటెన్షన్‌ సీకింగ్‌ డిజార్డర్‌ అనే ఒక కొత్త జబ్బు కనిపెట్టారు. ఎక్కడైనా పెళ్లికి వెళ్లినప్పుడు అటెన్షన్‌ అంతా పెళ్లి పిల్లగాడిపైనే ఉండటం చూసి.. తానే పెళ్లి పిల్లగాడినైతే బాగుండని, ఎక్కడైనా సావుకు పోయినప్పుడు శవయాత్ర జరుగుతుంటే తానే శవాన్ని అయితే ఇంకా బాగుండు అని ఆ జబ్బుతో బాధపడేవారికి ఉంటుంది..’ అంటూ బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  

చంద్రబాబు వ్యాఖ్యలపై నో కామెంట్‌ 
పెట్టుబడుల కోసం దావోస్‌కు వెళ్లరంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ముఖ్యమంత్రి నిరాకరించారు. పెట్టుబడులే కాకుండా ప్రపంచం ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్తామని అన్నారు.  

సింగపూర్‌తో కలిసి పనిచేస్తాం.. 
యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ సిలబస్, అధ్యాపకులకు శిక్షణ, స్టూడెంట్స్‌ ఎక్ఛ్సేంజీతో పాటు ఆర్థిక అంశాలపై సింగపూర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ఐటీఈ)తో ఎంఓయూ చేసుకున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సాంకేతిక నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సింగపూర్‌ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. సింగపూర్‌ విదేశాంగ, పెట్టుబడుల మంత్రులకు.. మూసీ ప్రక్షాళన, యువతలో నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సీఎం వివరించగా, వారు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని శ్రీధర్‌బాబు చెప్పారు.  

కార్యాచరణ దశలో 17 ప్రాజెక్టులు 
‘గత ప్రభుత్వం 2022–23లో దావోస్‌లో రూ.20 వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటే మేము గత ఏడాది జనవరిలో రూ.40 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం. 14 కంపెనీలతో 18 ప్రాజెక్టులకు ఎంఓయూలు చేసుకోగా, 17 ప్రాజెక్టులు కార్యాచరణ దశలో ఉన్నాయి. 10 ప్రాజెక్టుల నిర్మాణ పనులు 60–70 శాతం పూర్తయ్యాయి. మరో 7 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయి. 

తాజాగా రూ.1,78,950 కోట్లు, జూరిక్‌లో మరో రూ.4 వేలు కోట్లు కలిపి మొత్తం రూ.1,82,950 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నాం..’ అని వివరించారు. విలేకరుల సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)