Breaking News

అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం

Published on Mon, 07/08/2024 - 06:03

కవాడిగూడ: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అందరిదీ అని.. తమ సర్కారు మతసామరస్యాన్ని కాపాడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సర్వ మతాలకు స్వేచ్ఛ, భావజాలం వ్యాప్తికి అవకాశం ఇవ్వడంతోపాటు భక్తులకు సౌకర్యాలు కలి్పంచడాన్ని బాధ్యతగా తీసుకుంటోందన్నారు. అన్ని మతాల ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తామన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా తమ ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. ఆదివారం అబిడ్స్‌ ఇస్కాన్‌ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన పూరీ జగన్నాథ రథయాత్రకు సీఎం రేవంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి ఇచ్చి రథం ముందు చీపురుతో రోడ్డు ఊడ్చి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజుల కాలం నుంచి వస్తున్న పూరీ సంప్రదాయాన్ని తాను సీఎం హోదాలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాడిపంటలు బాగా పండి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటున్నానని తెలిపారు. అనంతరం భాగవతం కాపీలను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇస్కాన్‌ నిర్వాహకులు ప్రసాదం అందజేసి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ మందడి అనిల్‌ కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, కాంగ్రెస్‌ ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితోపాటు భక్తులు పాల్గొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి