Breaking News

సాయి కుటుంబానికి అండగా ఉంటాం

Published on Wed, 04/30/2025 - 11:04

జనగామ: జనగామ పట్టణం 21వ వార్డు కుర్మవాడకు చెందిన పర్శ మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సాయికి మెరుగైన వైద్య పరీక్షలతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) భరోసా కల్పించింది. ‘నా కొడుకును సంపేయండి’ అంటూ ఈనెల 29న సాక్షిలో ప్రచురితమైన కథనం మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. 

సీఎంఓ ఆదేశాల మేరకు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఉత్తర్వులను అనుసరించి జనగామ ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్‌ కమిషనర్‌ సాయి తల్లిదండ్రులు ఉంటున్న నివాసం, ఆర్థిక పరిస్థితులపై కలెక్టర్‌కు రిపోర్టు చేశారు. మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న సాయిని నిమ్స్‌కు తరలించి, మెరుగైన వైద్య పరీక్షలు అందించే విధంగా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బాధితుడికి ఉన్న స్థలంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా నివేదిక తయారు చేసి అందించాలని ఆదేశించారు. 

చదవండి: నా కొడుకును సంపేయండి

రాజీవ్‌ యువవికాసం పథకం ద్వారా బాధిత కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చూస్తామన్నారు. ‘సాక్షి’ చొరవతో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుండటంతో కాలనీ వాసులు అభినందించారు. కాగా, సాయి తల్లిదండ్రులకు అండగా ఉంటామని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హామీఇచ్చారు. అలాగే సాయి ఆరోగ్య పరిస్థితులపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరాతీశారు. సాయి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. జీరో కరెంటు, సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు.  

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)