అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీకి సీఎం రేవంత్
Published on Wed, 08/05/2026 - 05:03
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతుల సాధనే ఎజెండాగా ఆయన ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్. పాటిల్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్లతో భేటీ కానున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యంలో అటవీ, పర్యావరణ అనుమతులు కోరుతూ ఇరువురు మంత్రులకు ఆయన వినతిపత్రాలు సమర్పించనున్నారు. అదే విధంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున వీలును బట్టి పలు శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను, పార్టీ పెద్దలను కలిసే అవకాశముందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
#
Tags : 1