Breaking News

ప్రపంచ దేశాలతోనే పోటీ: సీఎం రేవంత్‌

Published on Fri, 07/04/2025 - 06:02

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తుల ఎగుమతి విషయంలో మాకు దేశంలోని ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు. అమెరికా, సింగపూర్, కొరియా, యూకే వంటి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతోనే మాకు పోటీ ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సహా దేశంలోని ఏ ఒక్క నగరం కూడా మన హైదరాబాద్‌తో పోటీ పడలేదు..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

మహేశ్వరం మండలంలోని పారిశ్రామిక జనరల్‌ పార్క్‌లో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మలబార్‌ బంగారు, వజ్రాభరణా ల తయారీ సంస్థను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.  

ఇక్కడ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు 
‘తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారికి, వారి ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది. గత 20 ఏళ్లలో పాలకులు మారారే కానీ.. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆయా ప్రభుత్వాల విధానాలు మాత్రం మారలేదు. మేం పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దారులను కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించొచ్చు.  

కొనుగోళ్లలో తెలుగు మహిళల ముందంజ 
బంగారు, వజ్రాభరణాల కొనుగోలు విషయంలో ఇతర రాష్ట్రాల మహిళలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల మహిళలే ముందుంటారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మహిళలు ఉంటారు. బంగారు ఆభరణాల తయారీకి మహేశ్వరం అనువైన ప్రదేశం. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయడం అబినందనీయం. 

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహేశ్వరం, ముచ్చర్ల, బేగరి కంచె కేంద్రంగా 30 వేల ఎకరాల్లో భారత ఫ్యూచర్‌ సిటీని తీర్చి దిద్దబోతున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాదు వారికి లభాలు చేకూరేలా ప్రభుత్వం సహకరిస్తుంది..’అని సీఎం హామీ ఇచ్చారు. 

తయారీ రంగానికీ హబ్‌గా మార్చేందుకు కృషి: శ్రీధర్‌బాబు 
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా రంగాల మాదిరే తయారీ రంగానికీ తెలంగాణను హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణ తయారీ రంగం గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ (జీవీఏ) 2022–23లో రూ.1.34 లక్షల కోట్లు ఉండగా, 2023–24లో 9 శాతం వృద్ధితో రూ.1.46 లక్షల కోట్టకు చేరిందని తెలిపారు. 

తెలంగాణ జీఎస్‌డీపీలో తయారీ రంగం వాటా 19.5 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో ఇది 17.7 శాతమే ఉందని చెప్పారు. తెలంగాణ తయారీ రంగ ఎగుమతులు రూ.1.2 లక్షల కోట్ల మార్కు దాటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్, మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)