Breaking News

నా స్కూల్‌ మీ వద్దే అని ప్రధాని మోదీకి చెప్పాను: సీఎం రేవంత్‌

Published on Sun, 06/08/2025 - 16:47

హైదరాబాద్‌: హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ 'ఆటో బయోగ్రఫీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్​ శిల్పకళా వేదికలో ఆదివారం( జూన్‌8) ఘనంగా నిర్వహించారు 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్‌గా ఎన్నో రాజకీయ ఓడి దుడుకులు ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మొన్న నీతి అయోగ్ మీటింగ్‌లో ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడును చూపించి అప్ కి సాతి యా వా హై(మీ స్నేహితుడు అక్కడున్నారు) అన్నారు. 

నేను ప్రధానికి చెప్పాను నేను స్కూల్ మీ దగ్గర చదివాను , కాలేజీ వారి(టీడీపీ) దగ్గర చదివి, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని అన్నాను. అన్ని రాజకీయ పార్టీల నేతలు అరుదుగా ఒక వేదికపై కనిపిస్తారు అంటే అది అలయ్ బలయ్ వేదిక. మా మంత్రి వర్గం అంత ఇక్కడే ఉంది. నేను ఇక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. 

హైదరాబాద్ ప్రజల గుండెల్లో  పి. జనార్ధన్ రెడ్డి, దత్తాత్రేయలది చెరగని ముద్ర. దత్తాత్రేయ ముక్కు సూటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకి వెళ్ళాలి. కిషన్ రెడ్డితో నాకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా. కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకి తీసుకెళ్తాను’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. 

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)